Header Banner

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లింపు.. నారా లోకేశ్ హామీ! విద్యావ్యవస్థలో సంచలన మార్పులు!

  Wed Mar 12, 2025 20:31        Politics

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రీయింబర్స్మెంట్స్ను తిరిగి తీసుకువస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. సభలో చర్చించకుండా వైకాపా సభ్యులు బయటకు వెళ్లిపోయి తోకముడిచారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.


ఇది కూడా చదవండినిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..


టీచర్లపై పెట్టిన కేసులు మాఫీ చేసే బాధ్యత మాది...
జీవో 117 వల్ల 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లపై గతంలో పెట్టిన కేసులన్నింటినీ మాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. టీచర్లకు యాప్ల భారం తగ్గిస్తున్నామని, నోట్ బుక్లు, పుస్తకాలు, బెల్టులు, బ్యాగ్లు, చిక్కీల పైనా గత సీఎం జగన్ తన ఫొటో ముద్రించుకోగా.. ఇకపై ప్రభుత్వ ముద్రతోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ రంగుల్లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా కిట్లు ఇస్తామన్నారు. పిల్లలకు యూనిఫాంలు మార్చి.. నాణ్యమైనవి ఇస్తున్నామన్నారు. భారం లేకుండా పుస్తకాల సంఖ్య తగ్గించినట్లు తెలిపారు. పుస్తకాలు, బ్యాగ్లపై ప్రభుత్వ లోగో ఉంటుంది కానీ, సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ఎక్కడా పెట్టలేదన్నారు.


ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


టీచర్ ట్రాన్స్ఫర్ యాక్టును అమలు చేస్తాం..
రాబోయే 5 ఏళ్లలో చిక్కీల కింద రూ.240 కోట్లు, కోడి గుడ్లపై రూ.144 కోట్లు ప్రభుత్వం సేవ్ చేస్తుందని, చాలా పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వ సొమ్ము ఆదా చేశామన్నారు. ప్రతి గ్రామానికి మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేయాలనేది లక్ష్యమన్నారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని అమలు చేయాలన్నది లక్ష్యమని, కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మానిటరింగ్ చేస్తామన్నారు. పుస్తకాల్లో ప్రతి ఛాప్టర్కు క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నామన్న లోకేశ్.. ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే' గా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమరావతిలో ప్రపంచస్థాయిలో టీచర్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియారిటీ జాబితాను ప్రకటించామని, జాబితాపై అభ్యంతరాలు తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేస్తామన్నారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్టును అమలు చేస్తామని, డీఎస్సీ నోటిఫికేషన్ తప్పకుండా విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాదిలోపే ఉపాధ్యాయులను నియమించే బాధ్యత తీసుకుంటామన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #teachers #feepending #transfers #Naralokesh #todaynews #flashnews #latestnews